తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురులో శుక్రవారం మధ్యాహ్నం కారు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగిపోయి కారుపై పడి, కారు పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే స్థానికులు స్పందించడంతో కారులో ఉన్న వారిని సురక్షితంగా బయటికి తీయగలిగారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. వారంతా శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.