నిత్యం అనేకమంది ప్రయాణించే ప్రధాన రహదారి గోతులమయంగా మారింది. మామిడికుదురు మండలం పాసర్లపూడి ఏటిగట్టు దిగువ నుంచి అప్పనపల్లి, బి. దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామాలకు వెళ్లే ఆర్&బీ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఈ మార్గంలో పలుచోట్ల ఏర్పడిన పెద్ద పెద్ద గోతుల్లో వర్షం నీరు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి మరమ్మతులకు అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు ఆదివారం కోరారు.