మామిడికుదురు: గోదావరిలో పడి వ్యక్తి మృతి

53చూసినవారు
మామిడికుదురు: గోదావరిలో పడి వ్యక్తి మృతి
మామిడికుదురు మండలం పెదపట్నంకు చెందిన మోటుపల్లి స్వామినాయుడు (36) బహిర్భూమికి వెళ్లి గోదావరిలో పడి మృతి చెందాడు. అతడి మృతదేహం సోమవారం లభ్యమైంది. అతడు హైదరాబాదులో టైలరింగ్ చేస్తూ ఉంటాడని, వేసవి సెలవులకు స్వగ్రామం వచ్చిన ఇద్దరు పిల్లల్ని మంగళవారం హైదరాబాద్ తీసుకు వెళ్లవలసి ఉందన్నారు. ఈ లోపులో ప్రమాదం జరగటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

సంబంధిత పోస్ట్