మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామంలో బుధవారం 13 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ పట్టాలు అధికారుల దగ్గర ఉండిపోయాయని, దాని వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పల్లె పండుగలో లబ్ధిదారులు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ వద్ద ఇటీవల వాపోయారు. పట్టాలను తక్షణం లబ్ధిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దీంతో పట్టాలను లబ్ధిదారులకు అందించారు. కూటమి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.