అంబేడ్కర్ పట్ల ఉచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని మామిడికుదురు మండలం నగరంలో శనివారం అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. డీసీసీ అధ్యక్షులు కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకునే అంబేడ్కర్ ను అవమానించడం దారుణమైన విషయమన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సూచించారు. సమావేశంలో సీపీఐ, సీపీఎం, మాల మహానాడు నేతలు పాల్గొన్నారు.