మామిడికుదురు: ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు: మాజీ మంత్రి

81చూసినవారు
మామిడికుదురు మండలం ఈదరాడలో తాగునీటి చెరువును మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. మండలం పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మగటపల్లి, ఈదరాడ, కొమరాడ, ఆదుర్రు గ్రామాలకు రెండు రోజుల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని, ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్