మామిడికుదురు: బాలాజీని దర్శించుకున్న ఎమ్మెల్యే

71చూసినవారు
పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారిని శుక్రవారం ఉత్తర ద్వారం మీదుగా దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువై ఉన్న బాలబాలాజీ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అర్చకుల నుంచి వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఆయన వెంట జడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు కూటమి నేతలు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్