మామిడికుదురు: సంక్షేమం, అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం కృషి

55చూసినవారు
మామిడికుదురు మండలం మగటపల్లిలో గురువారం రాత్రి కూటమి నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉమ్మడి తూ. గో. జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు కేక్ కట్ చేసి, పార్టీ శ్రేణులకు స్వీట్లు పంచారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని రాంబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్