మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకలో నిర్వహిస్తున్న భూముల రీ సర్వేపై ఎమ్మార్వో శరణ్య మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, రీసర్వే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా భూ యజమానుల సమక్షంలోనే ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా చేపట్టిన సర్వేలో ఎటువంటి తేడాలు లేకుండా సక్రమంగా సర్వే పూర్తి చేయాలన్నారు.