మామిడికుదురు మండలం పాశర్లపూడిలంక గ్రామ దేవత చింతాలమ్మ జాతర మహోత్సవం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి జాతరలో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్నారు. అనంతరం మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అన్న పాటకు కత్తి పట్టి స్టెప్పులు వేశారు. ఆయనతో పాటు స్థానికులు నృత్యం చేయడంతో జాతరలో సందడి వాతావరణం నెలకొంది.