మామిడికుదురు: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు: ఎమ్మెల్యే

67చూసినవారు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జనసేన ముందుకు వెళ్తుందని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గురువారం జనసేన పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. పార్టీకి ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్