మామిడికుదురు: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

64చూసినవారు
మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటే తమ కుటుంబానికి అండగా నిలుస్తారని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. మామిడికుదురు మండలం పాశర్లపూడిలో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్