మామిడికుదురు మండలం, నగరం పెద పంజీషా వద్ద గురువారం జరిగిన కార్యక్రమంలో ఉమ్రా యాత్రకు వెళ్తున్న భక్త బృందానికి పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అల్పాహారం కిట్లను అందజేశారు. నగరం పెద పంజీషాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లింలతో పాటు ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉమ్రా యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగాలని ఆకాంక్షించారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు.