అంబాజీపేట మండలంలోని పుల్లెట్టికుర్రు గ్రామంలో బుధవారం ఉదయం నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకలలో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అహింస ద్వారా దేశానికి స్వతంత్రం తెచ్చి పెట్టిన మహనీయుడు గాంధీ అని అన్నారు.