గోగన్నమఠంలో జనసేన జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

61చూసినవారు
మామిడికుదురు మండలం గోగన్నమఠం పరిధిలోని తోట మెరకలో జనసేన పార్టీ జెండాను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకోవాలని తెలిపారు. రాజోలు నియోజకవర్గంలో గోగన్నమఠం గ్రామానికి జనసేన పార్టీ విషయంలో ప్రత్యేక స్థానం ఉంది అని అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియచేయాలన్నారు.

సంబంధిత పోస్ట్