ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని కాశివారి తూము ప్రాంతంలో పంటకాలువలో శనివారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టి మృతుడి వివరాలను వెల్లడించారు. మృతుడు అదే ప్రాంతానికి చెందిన బొడ్డు సత్యనారాయణ (79)గా పోలీసులు గుర్తించారు. పెరాలిసిస్ భాదితుడైన సత్యనారాయణ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు.