మామిడికుదురు మండలం నగరం పోలీస్ స్టేషన్ లో బుధవారం విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఎస్ఐ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో పోలీసుల విధులు, వారి బాధ్యతలు, ఆయుధాలు, గ్రామాల నైసర్గిక స్వరూపం తదితర వివరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణను పురస్కరించుకొని ఓపెన్ హౌస్ నిర్వహించామని ఎస్ఐ తెలిపారు.