పి. గన్నవరం: రేపటి నుంచి అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం

73చూసినవారు
పి. గన్నవరం మండలం మానేపల్లి శ్రీఅయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని ఆలయ నిర్వాహకులు కాలిశెట్టి ప్రకాష్ శనివారం తెలిపారు. ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాభిషేకాలు, ఆయుష్ హోమాలు, విష్ణు సహస్రనామ పారాయణం, దీపోత్సవం జరుగుతాయన్నారు. సోమవారం అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకం, సహస్ర నామార్చన, ప్రముఖులకు సన్మానాలు, ఉచిత వైద్య శిబిరం, అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్