మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం వద్ద కొలువై ఉన్న బాలాజీ స్వామిని దర్శించుకుని పులకించారు. తెల్లవారుజాము నుంచి ఆలయానికి భారీగా భక్తులు తరలి రావడంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది.