కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ అమ్మఓడి ఇస్తానని జగన్ మోసగించారని టీడీపీ కో-కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకాన్ని మాజీ సీఎం జగన్ ఓర్వలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. శుక్రవారం పి. గన్నవరంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇంట్లో ఉన్న పిల్లలందరికీ 'తల్లికి వందనం' అందిస్తోందని తెలిపారు.