పి. గన్నవరం: జగ్జీవన్ రామ్ కు ఎమ్మెల్యే ఘన నివాళి

0చూసినవారు
పి. గన్నవరం: జగ్జీవన్ రామ్ కు ఎమ్మెల్యే ఘన నివాళి
సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, వారి అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కొనియాడారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేట, పి. గన్నవరం డొక్కా సీతమ్మ ఆక్విడెక్ వద్ద ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఆదివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్