ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ నిబద్ధతను చాటుకుంటుందని పి. గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ అన్నారు. పి. గన్నవరం మండలం పి. గన్నవరంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం పథకం అందించనున్నారన్నారు.