రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ ఐటీ ప్రభుత్వ సలహాదారుడుగా పెన్నమరెడ్డి నాగబాబుకు బాధ్యతలు చేపట్టి తొలిసారి శనివారం పి. గన్నవరం విచ్చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గిడ్డి సత్య నారాయణ, కూటమి నాయకులతో కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. పి. గన్నవరం మూడు రోడ్ల కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.