కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గురువారం పి. గన్నవరంలో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. పి. గన్నవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అన్నారు. అప్పనపల్లి, అయినవిల్లి కాజ్వేలకు నిధులు మంజూరయ్యాయని ప్రకటించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నియోజకవర్గానికి అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.