అర్హత కలిగి ఉన్న వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఆయన మామిడికుదురు మండలంలోని లూటుకుర్రులో శుక్రవారం లబ్ధిదారులు ప్రభుత్వం నుంచి అందిన సహకారంతో నూతనంగా నిర్మించుకున్న గోకులం పశువుల శాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అడబాల తాత కాపు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.