కష్టపడితే విజయం మన సొంతమవుతుందని ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి అన్నారు. పి. గన్నవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి కిట్లను బుధవారం ఆమె అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కష్టపడి చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కోన హెలీనా పాల్గొన్నారు.