అమరావతి ప్రాంత మహిళలపై అసభ్య వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పి. గన్నవరంలో మంగళవారం కూటమి పార్టీలకు చెందిన మహిళలు మూడు రోడ్ల కూడలిలో ఆందోళన చేపట్టారు. టీడీపీ మహిళా నేత మద్దుల రాజేశ్వరి. కొమ్మినేని, కృష్ణంరాజుల చిత్రపటాలను చెప్పుతో కొట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, కూటమి నేతలు పాల్గొన్నారు.