పి. గన్నవరంలో తూడు తొలగింపుకు రూ. 1. 50 కోట్లు

57చూసినవారు
పి. గన్నవరం సబ్ డివిజన్ పరిధిలోని పంట కాలువల్లో తూడు తొలగింపుకు రూ. 1. 50 కోట్లు మంజూరయ్యాయని సబ్ డివిజన్ డీఈఈ వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. ఓఅండ్అం నిధులతో 34 రకాల పనులు చేపట్టేందుకు టెండర్లు ఖరారు అయ్యాయని తెలిపారు. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి. గన్నవరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో తూడు తొలగిస్తామన్నారు. పి. గన్నవరం కాలువలో 59 కిలో మీటర్లు పనులు చేపడుతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్