పామర్రు మండలంలో వాతావరణంలో మార్పు రైతులను ఆందోళన కలిగిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం వాతావరణం మేఘావృతమై, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. కల్లంలో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకాల వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని, కనీసం పెట్టుబడి డబ్బులు అయినా వస్తే చాలు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.