మామిడికుదురు మండలం పాశర్లపూడి కైకాల పేట నుంచి పెట్రోల్ బంకు వరకు 216వ నంబర్ జాతీయ రహదారి ఎట్టకేలకు అభివృద్ధికి నోచుకుంది. 850 మీటర్ల మేర రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పగలు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని రాత్రి సమయంలో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాటికి పనులు పూర్తి అవుతాయని అధికారులు గురువారం తెలిపారు.