పాసర్లపూడి: చెత్త డంపింగ్ కు వ్యతిరేకంగా నిరసన

76చూసినవారు
మామిడికుదురు మండలం అప్పనపల్లి-పాశర్లపూడి గ్రామాల మధ్య ఉన్న కాజ్ వే పక్కన కొందరు స్వార్థపరులు చెత్తను వేసి డంపింగ్ యార్డ్ గా మార్చేశారని స్థానికులు శనివారం ఆరోపించారు. ఈ నేపథ్యంలో చెత్త డంపింగ్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తక్షణమే ఇరు గ్రామ పంచాయతీల అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్