ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి

76చూసినవారు
మామిడికుదురులో శుక్రవారం నగరం పిహెచ్‌సి ఆధ్వర్యంలో 95 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. పిహెచ్‌సీ వైద్య అధికారిని స్వర్ణలత ఆధ్వర్యంలో సిబ్బంది పలువురికి పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వైరల్ జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉందని ప్రజలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వైద్య సిబ్బంది రోషిని, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎం దుర్గాదేవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్