మానవ హక్కుల రక్షణ కోసం, ఆదవాసీల సంక్షేమం కోసం నినదించిన మానవతావాది దివంగత ప్రొ. డాక్టర్ గోకరకొండ నాగ సాయిబాబా అని అయినవిల్లి మాజీ జడ్పీటీసీ గంగుమళ్ళ కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. అయినవిల్లి మండలం కె. జగన్నాధపురంలో అన్నపూర్ణ ఇంటి వద్ద బుధవారం సాయిబాబా సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు జి. లక్ష్మణ్, సాయిబాబా సోదరులు జి. రామ్ దేవ్ పాల్గొని ప్రసంగించారు.