అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన సరెల్ల వీరేంద్ర కుమార్ ఉపాధి కోసం విదేశానికి వెళ్లే క్రమంలో ఏజెంట్ చేతిలో మోసపోయాడు. వంటపని కోసం వెళ్లి సౌదీ అరేబియాలో ఒంటెల వద్ద కాపరిగా చిక్కుకున్నాడు. ఆదివారం కొత్తపేట ఆర్డీఓ సత్యనారాయణ వీరేంద్ర కుమార్ బాధితుడి ఇంటికి వెళ్లి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. వీరేంద్ర కుమార్ను ఇండియన్ ఎంబసీ ద్వారా స్వదేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.