పి. గన్నవరం మండలంలో శుక్రవారం ఉదయానికి గోదావరి వరదనీటి ఉద్ధృతి తగ్గింది. గత పది రోజులగా లంక గ్రామాలను వరద ముంచెత్తడంతో లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కె. ఏనుగుపల్లి లంక, శివాయలంకలో గ్రామాలు గోదావరి వరద ముంపు నుంచి తేరుకుంటున్నాయి. అయితే వరద వలన లంక గ్రామాలలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.