క్రాఫ్ట్, పీఈటీ, ఆర్ట్ టీచర్లను రెగ్యులర్ చేయాలని వినతి

59చూసినవారు
క్రాఫ్ట్, పీఈటీ, ఆర్ట్ టీచర్లను రెగ్యులర్ చేయాలని వినతి
సమగ్ర శిక్షలో 2012 నుంచి పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్ స్ట్రక్టర్ (క్రాఫ్ట్, పీఈటీ, ఆర్ట్) లను రెగ్యులర్ చేయాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు అంబాజీపేట మండలం తొండవరంలో ఉపాధ్యాయులు శనివారం వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో ఐదువేల మంది పని చేస్తున్నారని చెప్పారు. తమకు ఉద్యోగ భద్రత లేదని, చాలీచాలని జీతంతో పని చేస్తున్నామని వాపోయారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్