మామిడికుదురు మండలం అప్పనపల్లిలో వేంచేసి ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాలబాలాజీ స్వామి వారి ఆలయానికి శనివారం కావడంతో వేకువజాము నుంచి భక్తులు భారీగా పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు తొలి హారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయంలో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.