రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని, 70 శాతం మంది కౌలు రైతులే భూమిని సాగు చేస్తున్నారని కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు పేర్కొన్నారు. మామిడికుదురు మండలంలోని స్థానిక అంబేడ్కర్ సామాజిక భవనంలో మంగళవారం కౌలు రైతుల సమావేశం నిర్వహించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.