కూరగాయలు పడిపోయాయని చెప్పి ఫోన్ చోరీ

58చూసినవారు
కూరగాయలు పడిపోయాయని చెప్పి ఫోన్ చోరీ
మామిడికుదురు మండలం పాశర్లపూడిలో శనివారం ఓ వ్యక్తి సెల్ఫోన్ చోరీకి గురైంది. వివరాలు. గ్రామానికి చెందిన ఉప్పే బాలాజీ కూరగాయలు కొనేందుకు మార్కెట్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు అపరిచిత వ్యక్తులు కూరగాయలు కొంటున్నట్లు నటించి బాలాజీని మాట్లాడించారు. వంకాయలు కింద పడ్డాయి, తీసుకోమని చెప్పారు. అతను వంకాయలు తీసుకుంటుండగా జేబులోని మొబైల్ ను వారు చోరీ చేశారు. బాధితుడు నగరం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్