చిన్నపాటి వర్షానికే బురదమయంగా రహదారి

57చూసినవారు
చిన్నపాటి వర్షానికే బురదమయంగా రహదారి
అయినవిల్లి మండలంలోని కె. జగన్నాథపురంలో ప్రధాన రహదారి చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముమ్మిడివరం వెళ్లే ప్రధాన రహదారి మొత్తం పెద్దపెద్ద గోతులుతో అధ్వానంగా తయారైందని చెబుతున్నారు. ఈ దారిలో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు హడలిపోతున్నారు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని, ఇకనైనా సంబంధిత అధికారులు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్