తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూను అపవిత్రం చేసిన వారిపై విచారణ జరిపించి వారిని జైలులో పెట్టాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు అయ్యాజీ వేమా డిమాండ్ చేశారు. పి. గన్నవరం మండలం మొండెపులంకలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నుండి తీసిన ఆయిల్ వాడడంపై విచారణ జరిపించి, దోషులను జైలుకు పంపించాలని కోరారు.