విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

51చూసినవారు
అయినవిల్లి మండలంలోని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరుని ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవలు ద్వారా రూ. 1, 75, 000 ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్