దేవరపల్లి మండలం ధూమoతునిగూడెం పంచాయతీ సుబ్బరాయపురం లో డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహ అవసరాల నిమిత్తం ఉపయోగించిన నీరు, వర్షం నీరు కలిసి డ్రైనేజీ వ్యవస్థ లేక నీరు ఇళ్లల్లోకి ప్రవహిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. కొద్దిపాటి వర్షానికి కూడా రోడ్లపై ఉన్న వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరుతుందని దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని కోరుతున్నారు.