దుద్దుకూరు: తాడిచెట్టు పై పిడుగు పడ్డ దృశ్యం

52చూసినవారు
దేవరపల్లి మండలంలో ఆదివారం రాత్రి ఏకదాటిగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో దుద్దుకూరు గ్రామంలో చెరుకూరి శ్రీను ఇoటి దగ్గర తాడి చెట్టుపై పిడుగు పడింది. దీంతో తాడి చెట్టు పూర్తిగా దగ్ధమైంది. చెట్టుపై పిడుగు పడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్