దేవరపల్లి విద్యుత్తు సబ్ స్టేషన్ పరిధి దుద్దుకూరు గ్రామంలో గురువారం విద్యుత్ సరఫరా అంతరాయం కలుగనుంది. ఆర్డీడీఎస్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ పార్మర్లు వర్క్ నిమిత్తం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున గ్రామ విద్యుత్ వినియోగదారులు సహకరించాలని నిడదవోలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ అప్పారావు ఓ ప్రకటనలో తెలిపారు.