తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో ఆటోను వెనక నుండి వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రిలోని సీతంపేటకు చెందిన 11 మంది కుటుంబ సభ్యులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు బయల్దేరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.