నల్లజర్ల మండలం పోతవరంలో గంగాలమ్మ (ఊడుగులమ్మ) అమ్మ వారిని మంగళవారం మాజీ హోం మంత్రి, రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు తానేటి వనిత దర్శించుకున్నారు. గంగాలమ్మ తల్లి వారి ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని, జగనన్నను మళ్లీ సీఎంను చేయాలని అమ్మ వారిని ప్రార్ధించారు.