గోపాలపురం: కుమారుడిని చూసి వస్తుండగా ప్రమాదం

83చూసినవారు
గోపాలపురం: కుమారుడిని చూసి వస్తుండగా ప్రమాదం
తెలంగాణ మణుగూరుకు చెందిన సమ్మక్క (53) తన కంటి ఆపరేషన్ చేయించుకున్న కుమారుడిని పరామర్శించేందుకు అల్లుడు శివతో కలిసి ద్విచక్రవాహనంపై రాజమహేంద్రవరం వెళ్లింది. తిరుగు ప్రయాణంలో శనివారం ఏలూరు జిల్లా దుద్దుకూరులో లారీని వెనుక నుంచి ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సమ్మక్క మృతి చెందగా, శివకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్