గోపాలపురం నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఆదివారం జరిగింది. నల్లజర్ల టిడిపి పార్టీ కార్యాలయంలో ఏఎంసి చైర్మన్ గా యద్దనపూడి బ్రహ్మరాజు, డైరెక్టర్లు, సభ్యులతో కలిపి 15 మందితో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.