పకృతి విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటి వలన జరిగే నష్టం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం దేవరపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ విపత్తు, ప్రమాద నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఎంపీపీ కేవీకే దుర్గారావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి, ఈవోపీఆర్డీ, తదితరులు పాల్గొన్నారు.